HOW TO DOWNLOAD AADHAR CARD IN YOUR PHONE

Vijetha academy
0

 

ప్రతి ఒక్కరికి రోజు ఆధార్ కార్డు ప్రతీ చోటా అవసరం అవుతూవస్తుంది ప్రధానంగా ప్రభుత్వ పథకాలు డబ్బులు పొందాలన్న లేక ప్రభుత్వ పథకాలకు దరకాస్తు చేసుకోవలన్న ఆధార్ ఖచ్చితంగా అవసరం ఇక సిమ్ కార్డులు తీసుకోవడానికి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు జరాక్స్ తప్పనిసరిగా బ్యాంక్ కు అందజేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఆధార్ కార్డును ఎప్పుడూ మన వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో మీ దగ్గర ఆధార్ కార్డు లేకుంటే మీరు ఎక్కడనుంచి అయిన మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ కల్పించింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో నుంచే డైరెక్ట్ గా మీరే స్వయంగా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.👇

ఆధార్ కార్డు మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

👉🏻ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొదట మీ మొబైల్ నెంబర్ UIDAI లో రిజిస్టరై ఉండాలి.

👉🏻ఆధార్ కార్డు డౌన్లోడ్ కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

👉🏻మీ దగ్గర ఆధార్ నెంబర్, ఎన్ రోల్ మెంట్ నెంబర్, వర్చ్యువల్ ఐడి ఫై మూడింటిలో ఏది ఉన్న మీ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

👉🏻వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వెబ్‌సైట్ లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇

👉🏻పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో గెట్ ఆధార్ ఆప్షన్ పైన కింద ఉన్న డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

👉🏻అక్కడ ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ లో ఏదోకటి ఎంటర్ చేయండి

👉🏻ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి

👉🏻మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి

👉🏻ఇ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది

👉🏻డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.

మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది

ఆధార్ కార్డు మీ ఫోన్లో డౌన్‌లోడ్ కోసం కింద లింక్ ఫై క్లిక్ 👇

https://uidai.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)