మీ ఆధార్ కార్డు లో మీ ఫోటో ని ఇలా మార్చుకోండి

Vijetha academy
0

 
ఇండియా లోని అన్నీ రాష్ట్రాలలో ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి ప్రయోజనం పొందాలి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి అయితే ఈ ఆధార్ కార్డులోని ఫోటో చాలామందికి అసంతృప్తిని ఇచ్చింది.

అంటే ఆధార్ లోని ఫోటో సరిగ్గా లేదని చాలా మందే భాధపడుతుంటారు . అయితే ఆధార్ కార్డు లోని పేరు , అడ్రస్, పుట్టిన తేదీ ని మార్చుకున్నట్లు ఫోటోని కూడా మార్చుకునే అవకాశం ఉంది దీని కోసం వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ లింక్ పైన క్లిక్ చేయండి లేదా మీ సమీపంలోని “యుఐడిఎఐ” ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ కార్డులోని ఫోటోను మార్చుకునే అవకాశం ఉంది

అయితే ఇలా ఫోటో మార్పు చేసుకోవడం కోసం ఫీజు రూ. 25 లతో పాటు జీఎస్టీ ని చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ సెంటర్ లో ఉండే ఎగ్జిక్యూటివ్ మీ ఫోటోను మారుస్తారు

ఆధార్ కార్డ్ లోని ఫోటో మార్పుని కొన్ని దశల్లో చేసుకోవచ్చు అవి ఏమిటో ఒకసారి పరిశీలిస్తే ముందుగా వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన UIDAI వెబ్‌సైట్ లింక్ ఫై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి . అక్కడ నుంచి ఆధార్ నమోదు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేయండి.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ నింపి సమీపంలోని స్థానిక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు అందించండి

అక్కడ ఆధార్ ఎగ్జిక్యూటివ్ మీ బయో మెట్రిక్ వివరాలు తీసుకొని మీ ఫోటో తీసి మీ ఫోటో ని అప్డేట్ చేస్తారు ఆతరువాత ఎగ్జిక్యూటివ్ మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యుఆర్ఎన్) తో రసీదు స్లిప్ ని ఇస్తారు

ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ ఫోటో మార్చబడిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మళ్ళీ మీ URN ని ఉపయోగించండి. ఆ తరువాత ఆధార్ కార్డ్ కొత్త ఫోటో ఉన్న ఆధార్ కార్డును UIDAI వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ విధంగా ఆధార్ కార్డు లోని పాత ఫోటోని తీసి మీకు నచ్చిన కొత్త ఫోటోను సులభంగా యాడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు UIDAI వెబ్ సైట్ లింక్ & ఆధార్ కార్డు డౌన్లోడ్ లింక్ 👇

https://uidai.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)