ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా |ap free housing land distribution postponed

Vijetha academy
0
AP లో ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది మార్చి 25 ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసింది. ఈ ఉచిత ఇళ్ల పట్టాలను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల ముందుగా ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది కానీ ఎన్నికలు వాయిదాపడడంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ నిలిపివేసింది తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీ యదా విధిగా నడుస్తుంది అనుకున్నరు రాష్ట్ర ప్రజలంతా ఐతే సీఎం జగన్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను సేకరించింది. అదేవిధంగా ఖాళీ స్థలం ఉన్న వారికి కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వనుంది.ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గ గానే ఏప్రిల్ 14 న ఈ ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం కానుంది

Post a Comment

0Comments
Post a Comment (0)