80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సీఎం కేసీఆర్ TS రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తర్వాత.. 80,039 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇస్తాయన్నారు. ఈ ఉద్యోగాల భర్తీతో ఏటా ప్రభుత్వంపై రూ.7వేల కోట్ల భారం పడుతుందన్నారు. ప్రతి ఏడాది ఆయా శాఖలు ఖాళీల క్యాలెండర్ ప్రకటిస్తాయన్నారు
ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు: సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. SC/ ST/BC అభ్యర్థులు 49 సం.లు, దివ్యాంగులకు 54సం వయో పరిమితిగా ఉంటుందని చెప్పారు
శాఖల వారీగా ఖాళీలు వివరాలు :
ఉన్నత విద్యా శాఖ-7,878
విద్యాశాఖ-13,086
పోలీస్-18,334
రెవెన్యూ-3,560
వైద్య-12,755
బీసీ సంక్షేమ- 4,311
సాగునీటి- 2,692
SC సంక్షేమ-2,879
తెలంగాణ 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి సమాచారం & జిల్లా వారీగా ఖాళీల వివరాలు PDF కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇