ప్రస్తుత డిజిటల్ యుగం లో బ్యాంక్ అకౌంట్ నుంచి ఆధార్ నెంబర్ వరకు ప్రతి దానికి ఫోన్ నెంబర్ లింక్ చేయటం జరుగుతు వస్తుంది .ఈ ఫోన్ నెంబర్ కు వచ్చే OTP ఆధారంగానే బ్యాంక్ అకౌంట్ లో మనీ ట్రాన్సాక్షన్ ఆధార్ అప్డేట్ వరకు అన్నీ ఫోన్ నెంబర్ పైనే ఆధారపడి ఉంటుంది.
ఈ ఫోన్ నెంబర్ విషయం లో ఎ మాత్రం అశ్రద్ధ వహించిన ఇంక అంతే. ఐతే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఆఫీస్ అవసరాలకు ఒక సిమ్ ఫ్యామిలీ అవసరాలకు ఇంకొక సిమ్ ని యూస్ చేస్తున్నారు. అలాగే మన అడ్రస్ ప్రూఫ్ మీద ఎవరైనా దొంగ సిమ్ తీసుకున్నారో కూడా తెలీదు
అసలు మీ పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకొనేందుకు విజయవాడ టెలికామ్ విభాగం అద్భుతమైన అవకాశం కలిపించింది. ఐతే ఈ సేవలు ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు విజయవాడ టెలికామ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి తెలిపారు.
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు OTP వచ్చిన OTP ని ఎంటర్ చేసి Validate అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరోక వెబ్ పేజీ లో మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో షో కావటం జరుగుతుంది 👇