భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ప్రైట్ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 1074 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ప్రైట్  కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1074 ఉద్యోగాల

భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో జూనియర్‌మేనేజర్‌, ఎగ్జిక్యూటీవ్‌ లు, జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ తదితరపోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సివిల్‌, ఆపరేషన్స్‌, మెకానికల్‌,ఎలక్ట్రికల్‌, సిగ్నల్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. 

1. జూనియర్‌ మేనేజర్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌

ఇంజనీరింగ్‌, ప్రాడక్షన్‌, ఆటోమొబైల్‌, కంట్రోల్‌ మాన్యుఫాక్చర్‌

ఇంజినీరింగ్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు

అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.


2. ఎగ్జిక్యూటివ్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌,పవర్‌ సప్టయ్‌/అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌తదితర విభాగాల్లో డిప్లామో చేసిన వారు ఈ ఉద్యోగాలకుఅర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేలనుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.


 3.జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 10th, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 3౦ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ 

దరఖాస్తులకు చివరితేది: జులై 23, 2021

కంప్యూటర్‌ బేస్ట్‌ ఎగ్జామ్‌ తేది: 2021- సెస్టెంబర్‌ లేదా

అక్టోబర్‌లో జరగనుంది.

వెబ్‌సైట్‌  :https://dfccil.com/

Post a Comment

0Comments
Post a Comment (0)