TCS లో ఉచిత శిక్షణ తోపాటు ఉద్యోగ అవకాశాలు

Vijetha academy
0

 

ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభ‌వార్త చెప్పింది. వారి కెరీర్‌కు ఎంతో ఊత‌మిచ్చేలా ఉచిత కోర్సుల‌ను అందించ‌నుంది. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప‌దిహేను రోజుల‌ పాటు కెరీర్ సంబంధిత కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సు యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని సంస్థ పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు క‌నీసం 7 నుంచి 10 గంట‌ల కోర్సు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం గ్రామీణ‌ విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్న ఇంగ్లీష్‌ పై ప్ర‌త్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్  రూపంలో కోర్సు అందిస్తున్నారు.

ద‌ర‌ఖాస్తుకు అర్హతలు :

 అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు,ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

➡️ముఖ్యంగా బిహేవిరియ‌ల్ అండ్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజ‌న్స్‌  పై కోర్సులో అందించ‌నున్నారు.

➡️ TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది.

➡️ ప్ర‌తీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో వీడియోలు, ప్రెజెంటేష‌న్‌లు, రీడింగ్ మెటీరియ‌ల్‌ (Reading Material), టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయ‌బ‌డిన వీడియోలు, వెబ్‌నార్‌లు  అందిస్తుంది.

➡️అంతే కాకుండా విద్యార్థులు త‌మ ప్ర‌శ్న‌లు, సందేహ‌లు నివృత్తి చేసుకొనే అవ‌కాశం ఇస్తున్నారు.

➡️ ఈ కోర్స్‌ను విజ‌య‌వంతంగా మొత్తం పూర్తి చేసిన‌ త‌రువాత ప్ర‌తిభ ఆధారంగా స‌ర్టిఫికెట్‌లను అందిస్తారు.

➡️ అంతేకాకుండా, కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయవచ్చు.

➡️ ఈ కోర్సులో అభ్య‌ర్థికి బిహేవియ‌ర‌ల్ స్కిల్స్  వ‌ర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పిస్తారు .

➡️క‌మ్యూనికేష‌న‌ల్ స్కిల్స్‌ఫై ప్ర‌త్యేక క్లాస్‌  ఉంటాయి.

➡️అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు.

➡️ ఆర్టిఫిసియ‌ల్ ఇంటలిజ‌న్స్ అంశాల‌ను నేర్పిస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

Step 1: ఇది కేవ‌లం ఆన్‌లైన్ (online) ద్వారా మాత్ర‌మే అప్లె చేసుకోవాలి.

Step 2 :  కోర్సుకు సంబంధించి కింద ఉన్న అధికారిక వెబ్‌సైట్ లింక్ పైన క్లిక్ చేయండి👇 https://learning.tcsionhub.in/c

Step 3: అక్క‌డ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.

Step 4: ప్రతీ కోర్సు స్ట్ర‌క్చ‌ర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.

TCS లో జాబ్ పొందాలి అంటే అవసరమైన స్కిల్స్

SQLసర్వర్ DBA,లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ JS, ఒరాకిల్ DBA,సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, IOS డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, PLSQLper,PLSQL, ఈ ప్రొగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టీసీఎస్ పేర్కొంది.

TCS NQT 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఎగ్జామ్ సెషన్స్- డిసెంబర్ 2021, మార్చి 2022

విద్యార్హతలు- డిగ్రీ, పీజీ, డిప్లొమా పాస్ కావాలి. ప్రీ-ఫైనల్, ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.

కోర్సులు- విద్యార్థులు ఏ కోర్సు చదువుతున్నా నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు అప్లై చేయొచ్చు.

అనుభవం- ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు.

TCS NQT 2021: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి👇 https://learning.tcsionhub.in/hub/natio

వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలోనే టాపిక్స్ వివరాలు ఉంటాయి.

Step 3- మొదట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 4- ఆ తర్వాత మీరు రాయాలనుకునే టాపిక్‌కు సంబంధించిన టెస్ట్ ఎంచుకోవాలి.

Step 5- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Post a Comment

0Comments
Post a Comment (0)